Showing posts with label 2014 గురుపూజలు. Show all posts
Showing posts with label 2014 గురుపూజలు. Show all posts

27 Jul 2014

2014 గురుపూజల ఫోటోలు

2014 గురుపూజల ఫోటోలు 

"సజ్జన ధార్మిక వేదిక" నిర్వహించిన 31వ శ్రీ వ్యాస జయంతి కార్యక్రమ విశేషాలు 12-7-2014

"సజ్జన ధార్మిక వేదిక" ...... నాన్నగారు (ఐ.వి. గోపాలాచార్యులు) ఈ సంస్థను స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలో వచ్చే గురుపౌర్ణమికి ఎవరో ఒకరిని.... పెద్దలని ఆహ్వానించి, వారికి పాదపూజ చేసి, సన్మానించటం ఇన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ సంవత్సరం.... జూలై 12 శనివారంనాడు ..... విశాఖపట్నంలో, శ్రీహరిపురంలో, జవహర్ నగర్ లో వేంచేసియున్న "శ్రీరాధావేణుగోపాలస్వామి" ఆలయంలో మూడు రోజులు పలు ఆధ్యాత్మిక జరిగిన 31వ గురు పౌర్ణమికి డాll బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రిగారికి పాదపూజ చేసి, సన్మానించటం జరిగింది.


ఈ 31 సంవత్సరాలుగా సజ్జన ధార్మిక వేదిక సంస్థని స్థాపించి, కొంతమందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించినందుకుగాను వారు నాన్నగారికి కూడా ఈ సంవత్సరం సన్మానం చేసారు.


మాతృమండలి సభ్యులు, మిగిలిన శిష్యబృందంతో అమ్మ - నాన్నలు 


కార్యక్రమాలకి విచ్చేసిన భక్తజనం